వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జై తెలంగాణ సినిమా బాగుంది, హిట్ చేయండి: కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

KCR
హైదరాబాద్: జై తెలంగాణ చిత్రాన్ని అందరూ చూడాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఎంపీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజలకు పిలుపునిచ్చారు. రసమయి బాలకిషన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించి నటించిన జై తెలంగాణ చిత్రం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా పలు థియేటర్లలో విడుదలయింది. తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్‌తో కలిసి కెసిఆర్ ఆర్టీసి క్రాస్ రోడ్స్‌‍లోని దేవి థియేటర్‌లో ఆయన ఈ చిత్రాన్ని తిలకించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రసమయి బాలకిషన్ అద్బుతమైన కళాఖండాన్ని తీశారన్నారు. చిత్రం చాలా బాగుందని, ప్రజలందరూ ఈ చిత్రాన్ని ఆదరించి హిట్ చేయాలని కోరారు. కెసిఆర్, కోదండరామ్‌లతో పాటు తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు విఠల్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఈ చిత్రాన్ని చూశారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడారు. ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రజలు సమ్మక్క సారక్క జాతరకు తరలి వచ్చినట్లుగా వస్తున్నారని అన్నారు. మన చరిత్రను మనం నిలబెట్టుకుందామన్నారు.

కాగా పలువురు తెలంగాణవాదులు, టిఆర్ఎస్ నేతలు ఆయా ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని తిలకించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్, సిద్దిపేటలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, వరంగల్ జిల్లాలోని హన్మకొండ పట్టణం భవాని థియేటర్‌లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు ఈ చిత్రాన్ని చూశారు. కాగా గతంలో తెలంగాణ అంశంతో వచ్చిన శంకర్ జైబోలో తెలంగాణ, ఆర్ నారాయణ మూర్తి పోరు తెలంగాణ సినిమాలను కూడా కెసిఆర్ చూశారు. తెలంగాణ బతుకుకు ఆ చిత్రాలు అద్దం పడుతున్నాయని చూడాలని అప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

English summary
TRS chief K Chandrasekhar Rao appealed Telangana people to make hit Rasamayi Balakishan's Jai Telangana cinema.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X