హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం తెలంగాణ ఫోరం నాయకుడు, శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ఢిల్లీలో సీమాంధ్రవాది, రాష్ట్రంలో ప్రత్యేకవాది అని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ దుర్మార్గం వల్ల తెలంగాణ అమర వీరుల కుటుంబాలు దిక్కులేనివి అయ్యాయని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. విద్యార్థులను చంపి కెసిఆర్ రాజకీయ దాహం తీర్చుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు కెసిఆర్ ఏ మాత్రం సహాయం చేయడం లేదని ఆయన అన్నారు. తమ వద్దకు వచ్చే అమర వీరుల కుటుంబాలను తాము ఆదుకుంటామని ఆయన చెప్పారు. వారి కోసం తాము జోలె పట్టడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. కెసిఆర్, తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి తోడు దొంగలని ఆయన అన్నారు. కెసిఆర్‌ది రాతి గుండె అని, కెసిఆర్ అసలు తెలంగాణవాదే కారని ఆయన అన్నారు.
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల సమయంలో తాము గన్ పార్కు వద్ద ధర్నా చేస్తామని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల స్థితిగతులపై ఓ రోజంతా సభలో చర్చించాలని పట్టుబడుతామని ఆయన చెప్పారు. తెలంగాణలోని పది జిల్లాల్లో తిరిగి అమర వీరుల కుటుంబాలను కలుసుకుంటామని ఆయన చెప్పారు. అమర వీరుల కుటుంబాలను ఆదుకోవడానికి కెసిఆర్ ముందుకు రావడం లేదని ఆయన విమర్సించారు. వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని ఆయన డిమాండ్ చేశారు.