చిన జీయర్ స్వామి తిరుమల పాదయాత్రకు బ్రేక్

శుక్రవారం, ఫిబ్రవరి 3, 2012, 19:37 [IST]
Chinna Jeeyar Swami
తిరుమల: చిన జీయర్ స్వామి తిరుమల పాదయాత్రకు బ్రేక్ వేసి కారులో తిరుమల చేరుకున్నారు. అలిపిరి నుంచి తిరుమల వరకు ఆయన శుక్రవారం సాయంత్రం పాదయాత్ర చేపట్టారు. ఏడో మైలు రాయి వద్ద ఆయన అకస్మాత్తుగా పాదయాత్రను ఆపేసి కారులో తిరుమల చేరుకున్నారు. దీనిపై ప్రతిస్పందిస్తూ చిన జీయర్ స్వామి - మీడియా ప్రతినిధులు గమనిస్తున్నారో, లేదో తెలుసుకుందామని కారులో వచ్చానని అన్నారు. తిరుపతిలో ఉదయం ఆయన విష్ణుసహస్ర నామ స్త్రోత్ర పారాయణ మహాయజ్ఞం నిర్వహించారు. చినజీయర్ జీయర్ పేరుతో ఓ భక్తి వెబ్ ఛానల్ ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు తిరుమలకు పాదయాత్రను ప్రారంభించారు. అయితే, స్వామివారి దర్శనం దక్కదేమోననే ఉద్దేశంతో ఆయన కారులో వచ్చినట్లు చెబుతున్నారు. మాడవీధుల్లో స్వామివారి ప్రదక్షిణ సందర్భంగా దర్శనం చేసుకోవాలని ఆయన అనుకున్నారు. కానీ ఆయన అక్కడికి చేరుకునే సరికే ప్రదక్షిణ పూర్తయింది.

చిన జీయర్ స్వామి వరాహ స్వామిని దర్శనం చేసుకున్నారు. శ్రీవారికి మాత్రమే సహస్ర దీపాలంకరణ చేయాలని చినజీయర్ స్వామి అంటున్నారు. తిరుపతిలో ఆయన అంతకు ముందు మాట్లాడారు. తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారని ఆయన అన్నారు. టిటిడి వ్యవస్థ సక్రమమార్గంలో నడిచేలా చూడాలన్నారు. తిరుమల గురించి తెలిసిన వారే టిటిడి సభ్యులుగా ఉండాలని, ఆలయ పాలనలో లాజిక్కులు ప్రమాదకరమని హెచ్చరించారు. చరిత్ర తెలియని వారు చరిత్ర గురించి మాట్లాడటం బుద్ధి లేని పని అన్నారు. లోపాలను ఎత్తి చూపడం మా లక్ష్యం కాదన్నారు. వెయ్యికాళ్ల మండపం కూల్చి వేసిన అధికారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
English summary
Chinna Jeeyar Swami stopped his padayatra, takenup from Tirupathi to Tirumala
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets