ఏలూరు: తాను, తన సోదరుడు, హీరో పవన్ కల్యాణ్ అన్నయ్య, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవితోనే ఉన్నామని ప్రముఖ నిర్మాత నాగ బాబు గురువారం పశ్చిమ గోదావరి జిల్లాలో స్పష్టం చేశారు. తాము చిరంజీవితో లేమనే వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తామిద్దరం అన్నయ్యతోనే ఉన్నామన్నారు. ఆయన వల్లనే తాము ఈ స్థాయికి చేరుకున్నామని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనం అయ్యాక మాలో విభేదాలు వచ్చాయన్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. అవసరమైన పక్షంలో తన అన్నయ్య చిరంజీవి ఆదేశిస్తే కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం చేయడానికి కూడా సిద్ధమన్నారు. చిరంజీవిని ఎవరైనా ఏమైనా అంటే తాము సహించేది లేదన్నారు.
కాగా ఇటీవల మెగా సోదరుల మధ్య విభేదాలు వచ్చాయన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల పవన్ కల్యాణ్ పంజా ఆడియో విడుదలకు కుటుంబంలోని ఏ ఒక్కరూ హాజరు కాకపోవడం ప్రధానంగా చర్చానీయాంశమైంది. కాంగ్రెసులో పిఆర్పీ విలీనం ఇష్టం లేని పవన్ కల్యాణ్ చిరంజీవికి దూరంగా ఉంటున్నారనే వాదనలు వినిపించాయి. నాగ బాబు కూడా విలీనం తర్వాత అయిష్టతతో దూరంగా ఉంటున్నారని ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలను నాగబాబు కొట్టిపారేశారు.