ముంబై: ప్రముఖ హిందీ సినీ దర్శకుడు రాజ్ కన్వర్ కన్నుమూశారు. జీత్, దీవానా వంటి హిట్ చిత్రాలను అందించిన రాజ్ కన్వర్ సింగపూర్‌లో తుది శ్వాస విడిచారు. తొంబై దశకంలో త్రిముఖ ప్రేమ కథా చిత్రాలకు ఆయన పెట్టింది పేరుగా నిలిచారు. మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స తర్వాత ఆయన మరణించినట్లు తెలుస్తోంది. జీత్, లాడ్లా, దీవానా, జుదాయి వంటి హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు ఆయన చివరి చిత్రం సిదియాన్. ఇది 2010లో విడుదలైంది. ఆయన మృతికి బాలీవుడ్ సంతాపం ప్రకటించింది.
కన్వర్ దర్శకత్వం వహించిన దీవానా చిత్రంలో నటించిన ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ సంతాపం ప్రకటించారు. తన మిత్రుడు కన్వర్ కన్నుమూశారని, కన్వర్ లేని లోటు మిగిలే ఉంటుందని ఆయన అన్నారు. కన్వర్ ఆత్మకు శాంతి కలగాలని ఆయన ఆశించారు. రాజ్ కన్వర్ మృతి పట్ల మధుర్ భండార్కర్ విచారం వ్యక్తం చేశారు.