జయలలిత రివేంజ్, శశికళ సోదరుడు దివాకరన్ అరెస్ట్

శుక్రవారం, ఫిబ్రవరి 3, 2012, 9:44 [IST]
Jayalalitha-Sasikala
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత తన నెచ్చెలి శశికళపై ప్రతాపం చూపిస్తున్నారు. శశికళ సోదరుడు దివాకరన్‌ను జయ శుక్రవారం అరెస్టు చేయించారు. రిషియూర్ గ్రామంలోని ఓ మహిళ ఇంటిని పడగొట్టాడని ఆరోపిస్తూ తిరువరూర్జిల్లాలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. మద్రాసు హైకోర్టు దివాకరన్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. శశికళతో పాటు మరో పదకొండు మంది ఆమె బంధువులను పార్టీ నుండి గత డిసెంబరులో బహిష్కరించిన అనంతరం జయ తాజాగా శశికళ సోదరుడిని అరెస్టు చేయించింది. దివాకరన్ అరెస్టు తర్వాత శశికళ బంధువు రావణన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. దివాకరన్ తర్వాత రావణన్ అరెస్టు శశికళ బంధువుల్లో రెండోది. ఆయనను కోయంబత్తూరు జైలు నుండి పొళన్ జైలుకు తరలించారు.

కాగా జయలలితను కాదని పార్టీలో శశికళ డామినేషన్ పెరగటంతోనే ఆమెను, మరో పదకొండు మందిని బహిష్కరించిన విషయం తెలిసిందే. జయలలితకు శశికల చాలాకాలం పాటు సన్నిహితురాలిగా కొనసాగింది. 1991-1996 మధ్య కాలంలోని పలు అక్రమాల ఆరోపణలలో జయలలితతో పాటు శశికళ కూడా ప్రధాన నిందితురాలు. ఈ కేసు ప్రస్తుతం నడుస్తోంది. ఇటీవలే జయలలిత ఈ కేసులో కర్నాటక రాజధాని బెంగళూరులో పలుమార్లు కోర్టు ఎదుట హాజరయ్యారు. తొలుత బెంగళూరు కోర్టు ఎదుట హాజరు కావొద్దని నిర్ణయించుకున్నప్పటికీ సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆమె హాజరు కాక తప్పలేదు. మూడు దశాబ్దాలకు పైగా జయలలితకు సన్నిహితురాలిగా ఉన్న శశికళ, పార్టీలో మంత్రులను, నేతలను తన అదుపులో ఉంచుకోవడం గమనించిన తర్వాతే జయలలిత వారిని బహిష్కరించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

English summary
Tamilnadu CM Jayalalithaa's former aide Sasikala's brother Diwakaran was today arrested in Tiruvarur district for allegedly demilishing a woman's house in Rishiyur village. jayalalithaa, sasikala, diwakaran, tamilnadu, జయలలిత, శశికళ, దివాకరన్, తమిళనాడు
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets