అమ్మకానికి గఢాఫీ నెత్తుటి చొక్కా, వెడ్డింగ్ రింగ్

శుక్రవారం, ఫిబ్రవరి 3, 2012, 16:28 [IST]
Muammar Gaddafi
లండన్: లిబియా నియంత ముమ్మార్ గఢాఫీ హత్యకు గురైన సమయంలో ధరించిన చొక్కాను, వెడ్డింగ్ రింగును అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. గఢాఫీ చొక్కా నెత్తుటితో తడిసిపోయింది. తన హోమ్ టవుట్ సిర్టేలోని డ్రెయిన్ పైపు నుంచి గఢాఫీని బయటకు లాగి కొట్టిన తర్వాత కాల్చి చంపారు. ఆ సయమంలో అతను వెండి ఉంగరాన్ని ధరించి ఉన్నాడు. లిబియాకు చెందిన అహ్మద్ వర్ఫాలీ వాటిని 2 మిలియన్ల అమెరికా డాలర్లకు అమ్మడానికి ముందుకు వచ్చినట్లు సమాచారం.

గఢాఫీ ధరించడానికి చెబుతున్న ఉంగరాన్ని అరబ్ టుడే డాట్ నెట్ అప్‌లోడ్ చేసింది. ఆ ఉంగరాన్ని 1970 సెప్టెంబర్ 10వ తేదీన సాఫియాను పెళ్లి చేసుకున్న సమయంలో గఢాఫీ ధరించినట్లు ఎబిసి న్యూస్ చెబుతోంది. వాటిని సొంతం చేసుకుని ఐరోపాలో అధిక మొత్తానికి అమ్మాలని వర్ఫాలీ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. అది గఢాఫీ ఉంగరం కాదని, దాన్ని అతను అమ్మలేడని జింటాన్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్ వాల్‌లో రాసినట్లు డైలీ మెయిల్ రాసింది. గఢాఫీ కుమారుడు సైఫ్ అల్ - ఇస్లామ్ గఢాఫీ ఇక్కడే అరెస్టయ్యాడు.
English summary
Libyan leader Colonel Muammar Gaddafi’s shirt, which he had been wearing when he was killed, have reportedly been put up for sale along with his wedding ring.
User Comments
Narasimha Thota 04 Feb 2012 04:52 am
I don't know whether Gaddafi a good person or bad. But people trying to sell and buy his shirt soaked with his blood are really insane and cruel. Of course, there are people who can buy Marlyn Manroes used tampoons too. This is also blood soaked, but indicates their love for her.
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets