హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంగీత దర్శకుడు అనిల్ రెడ్డి మృతి కేసు కొట్టివేత

By Pratap
|
Google Oneindia TeluguNews

Anil Reddy
హైదరాబాద్: గమ్యం సినిమా సంగీత దర్శకుడు అనిల్ రెడ్డి మృతి కేసుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు మంగళవారం కొట్టేసింది. అనిల్ రెడ్డి మృతిపై సిఐడి విచారణ అవసరం లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. పోలీసు విచారణ మాత్రం కొనసాగుతుందని చెప్పింది. అనిల్ రెడ్డి మృతదేహానికి నిర్వహించిన పోస్టుమార్టం నివేదిక ఆధారంగా విచారణ కొనసాగుతుందని చెప్పింది. అనిల్ రెడ్డి మృతిపై ఆయన కుటుంబ సభ్యులు సందేహాలు వ్యక్తం చేశారు. అనిల్ రెడ్డి మృతిపై సిబిసిఐడి దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేశారు. అనిల్ రెడ్డి మృతదేహానికి మూడు సార్లు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికల్లో తేడాలు ఉండడంపై వారు మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు.

అనిల్ రెడ్డి తన ప్రియురాలు శాలిని ఇంట్లో నిరుడు ఏప్రిల్‌లో మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబం వారు ప్రియురాలిపై అనుమానాలు వ్యక్తం చేశారు. మొదటిసారి పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ వైద్యుల నివేదికలో అనిల్ రెడ్డి తలకు గాయాలు ఉన్నాయని తేలింది. రెండోసారి పోస్టుమార్టం నిర్వహించిన ఉస్మానియా వైద్యుల నివేదికలో గాయాలు లేనట్లుగా తేలింది. అనిల్ రెడ్డి మృతి సహజమైనదే అని రెండోసారి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తేల్చారు. అయితే, అనిల్ రెడ్డిది సహజ మరణమేనని శాలిని కుటుంబ సభ్యులు వాదించారు.

English summary
High Court quashed the petition filed expressing doubts on Gamyam film music director Anil Reddy's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X