నిరసనలతో మాల్దీవుల అధ్యక్షుడు నషీద్ రాజీనామా

మంగళవారం, ఫిబ్రవరి 7, 2012, 15:10 [IST]
Mohamed Nasheed
మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మొహమద్ నషీద్ మంగళవారం రాజీనామా చేశారు. సీనియర్ న్యాయమూర్తి అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలు గత వారం రోజులుగా చేస్తున్న నిరసన ప్రదర్శనలు తీవ్ర స్థాయికి చేరడంతో నషీద్ రాజీనామా చేసినట్లు మిలిటరీ ప్రకటించింది. రాజీనామా చేయడానికి నషీద్ అంగీకరించారని, ఉపాధ్యక్షుడు మొహమ్మద్ వాహీద్ హసన్‌కు అధ్యక్ష పదవిని అప్పగించడానికి కూడా ఒప్పుకున్నారని బ్రిగేడియర్ అహ్మద్ షియామ్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే వెంటనే నషీద్ నుంచి ఎటువంటి ప్రకటన కూడా వెలువడలేదు. రాజకీయ సంక్షోభం కన్నా బీచ్ రిస్టార్టులే ఆయన గద్దె దిగడానికి కారణమయ్యాయి.

మాజీ మానవ హక్కుల కార్యకర్త అయిన నషీద్ బహుళ పార్టీలు పాల్గొన్న ఎన్నికల్లో దేశంలో సుదీర్ఘంగా అధికారంలో ఉన్న పాలకుడిని ఓడించారు. ఇటువంటి స్థితిలో నషీద్ పతనం ఆశ్చర్యకరమైన విషయమే క్రిమినల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా మొహమ్మద్ అరెస్టు చేయాలని సైన్యానికి ఇచ్చిన ఆదేశాలు నషీద్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరడానికి కారణమైంది. మొహమ్మద్‌ను విడుదల చేయాలని ఉపాధ్యక్షుడు, సుప్రీంకోర్టు, మానవ హక్కుల కమిషన్, జ్యుడిషియల్ సర్వీసెస్ కమిషన్, ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ కార్యాలయం సూచించాయి. న్యాయమూర్తి రాజకీయ వివక్ష చూపించారని, అవినీతిపరుడని ప్రభుత్వం విమర్శించింది.
English summary
Maldives President Mohamed Nasheed resigned on Tuesday following weeks of public protests over his controversial order to arrest a senior judge, the military said.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets