బిపి ఆచార్యకు కోర్టులో చుక్కెదురు, బెయిల్ నిరాకరణ

గురువారం, ఫిబ్రవరి 9, 2012, 17:25 [IST]
BP Acharya
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి బిపి ఆచార్యకు నాంపల్లి ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. ఆచార్యకు కోర్టు బెయిల్ నిరాకరించింది. కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో అరస్టయిన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి బెయిల్ పిటిసన్‌పై విచారణ వాయిదా పడింది. నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. అలాగే ఎమ్మార్ కేసులో అరెస్ట్ అయిన స్టైలిష్ హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోనేరు ప్రసాద్ బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 13కు వాయిదా పడింది.

ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో తొలి ముద్దాయి బిపి ఆచార్య అని, దర్యాప్తు ముమ్మరంగా జరుగుతున్న ప్రస్తుత తరుణంలో బిపి ఆచార్యకు బెయిల్ ఇవ్వడం సరి కాదని సిబిఐ వాదించింది. విల్లాల విక్రయాలకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలన్నీ ఆచార్యకు తెలుసునని, ఓ నివేదికను కూడా ఆచార్య తొక్కి పెట్టారని సిబిఐ తెలిపింది. బిపి ఆచార్య బయటకు వస్తే సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందని, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని వాదిస్తూ బిపి ఆచార్యకు బెయిల్ ఇవ్వకూడదని సిబిఐ కోర్టును కోరింది.
English summary
CBI special court has rejected IAS officer BP Acharya. arrested in EMAAR case, bail petition.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets