కెసిఆర్ వల్లే జయశంకర్ మృతి చెందారు: మోత్కుపల్లి

గురువారం, ఫిబ్రవరి 9, 2012, 17:13 [IST]
Mothkupalli Narasimhulu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు గురువారం మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. కెసిఆర్ చేసిన అవమానం వల్లే ఆచార్య జయశంకర్ కుమిలి కుమిలి చనిపోయారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కెసిఆర్ మరోసారి సిద్ధమవుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సకల జనుల సమ్మెను అమ్ముకొని పోలవరం టెండర్లు దక్కించుకున్నారని ఆరోపించారు. టెండర్ల కోసం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను కెసిఆర్ అవమానించారన్నారు. అందుకు ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం టెండర్లు స్పీకర్ ముందు పెట్టాలన్నారు. టెండర్లను హైపవర్ కమిటీ రద్దు చేసిందని, దాంతో తాము చేసిన ఆరోపణలు నిజమని తేలాయన్నారు. కెసిఆర్, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయ శాంతి వలసవాదులు అని విమర్శించారు.

వలసవాదిగా వచ్చి తమను మోసం చేస్తున్న కెసిఆర్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఆయనకు గుణపాఠం చెబుతారన్నారు. కెసిఆర్‌ను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వలే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి మంత్రులను తన కేబినెట్లో కొనసాగిస్తున్నారని మరో నేత రేవంత్ రెడ్డి వేరుగా ఆరోపించారు.
English summary
TDP senior leader Mothkupalli Narasimhulu accused TRS chief K Chandrasekhar Rao for pro.Jayashankar dead.
User Comments
Narasimha Thota 10 Feb 2012 11:25 am
ఈ మాట మాత్రం నిజం. కెసిఆర్ వల్లనే జయశంకర్ చనిపోయాడు. కెసిఆర్ గాడిని ప్రజలు చెప్పులతో కొట్టే వరకు AP అండ్ తెలంగాణా బాగుపడదు.
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets