గుంటూరు: వైయస్ రాజశేఖర రెడ్డి రెక్కల కష్టంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మరోసారి అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో తన ఓదార్పు యాత్రను కొనసాగిస్తున్న ఆయన పరగతిచర్ల గ్రామంలో వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. వైయస్ రాజశేఖర రెడ్డిని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆయన విమర్శించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను పరామర్శిస్తానని నల్లకాలువలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నందుకే తనను ఇబ్బంది పాలు చేస్తున్నారని ఆయన అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో త్వరలో సువర్ణయుగం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.