బెంగళూరు/విశాఖపట్నం: రెండు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన వైభవ్ జ్యువెల్లర్స్ అధినేత మనోజ్ కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మృతదేహం కర్నాటక జిల్లాలోని హసన్ అడవుల్లో లభ్యమైంది. రెండు రోజుల క్రితం బెంగళూరు విమానాశ్రయంలో ఆయన కిడ్నాప్‌కు గురయ్యాడు. ఆ సమయంలో ఆయన వద్ద సుమారు మూడు నుండి నాలుగు కోట్ల రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయి. మనోజ్ తమిళనాడు గవర్నర్, మాజీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు దగ్గరి బంధువు అని తెలుస్తోంది. మనోజ్ సన్నిహితులు, క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మనోజ్‌పై గతంలోనూ ఓసారి హత్యా ప్రయత్నం జరిగినట్లుగా తెలుస్తోంది.
మనోజ్ విశాఖపట్నంలో వైభవ్ జ్యువెల్లర్స్ దుకాణం నడుపుతున్నారు. గతంలో జరిగిన హత్యా యత్నం వ్యాపార లావాదేవీల కారణంగా అని తెలుస్తోంది. మనోజ్ హత్య వ్యాపార లావాదేవీల కారణంగా జరిగిందా లేక ఆయన వద్ద విలువైన వజ్రాలు ఉండటం కారణంగా జరిగిందా అనే కోణంలో కర్నాటక పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆయన వయస్సు 43 ఏళ్లు. ఒక స్థలాన్ని కొనుగోలు చేసేందుకు మనోజ్ కుమార్ మంగళవారం బెంగళూరు వెళ్లారు. ఈ విషయంపై కొందరు వ్యాపారులతో చర్చించారు. మంగళవారం మనోజ్ మిత్రులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న మనోజ్‌కు బెంగళూరులో బంధువైన సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కిడ్నాప్‌కు గురైనట్లు నమోదు చేసుకున్నారు. అయితే గురువారం ఉదయం ఆయన విగతజీవుడిగా కనిపించారు. ఆయన కుటుంబం శోకసముద్రంలో మునిగి పోయింది.