పాము కరిచి పదో తరగతి విద్యార్థిని స్వప్నప్రియ మృతి

గురువారం, ఫిబ్రవరి 9, 2012, 17:08 [IST]
West Godavari District
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో పరీక్ష రాస్తుండగా ఓ విద్యార్థినిని పాము కరవడంతో మృతి చెందిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. జిల్లాలోని ఉంగుటూరు మండలం గల్లమిల్లి గ్రామానికి చెందిన స్వప్న ప్రియ అనే విద్యార్థిని బాదంపూడి జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఆమె ఉదయం పాఠశాలలో టాలెంట్ పరీక్ష రాస్తోంది. ఈ సమయంలో ఆమెను ఏదో కుట్టింది. వెంటనే స్వప్న ప్రియ ఉపాధ్యాయులను అడిగి ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లాక ఆమెకు కాస్త అస్వస్థతగా అనిపించింది. పాఠశాలలో ఏదో కుట్టిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు స్థానికంగా ఉన్న ఓ వైద్యుడికి చూపించారు. ఆమెకు వాంతులు అవుతుండటంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఆమెను ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందింది. ఆసుపత్రి వైద్యులు ఆమె మృతి చెందినట్లు చెప్పారు. ఉపాధ్యాయులు, స్థానికులు అక్కడ వెతకగా పాము నెర్రలు కనిపించాయి. వాటిని గునపంతో పెకిలించారు. అందులో ఉన్న పామును కర్రలతో మోది చంపారు. దీంతో ఆమెను పాము కరవడంతో మృతి చెందిందని చెబుతున్నారు. ఆమె మృతితో ఇంట్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు దిగ్బ్రాంతికి లోనయ్యారు.
English summary
Tenth class girl student dead today by snake bite in West Godavari district while writing exam.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets