లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావించారు. గురువారం ఆయన వారణాశిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్‌ను కాంగ్రెసు పార్టీ అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్లిందని అన్నారు. కాంగ్రెసుకు అవకాశమిస్తే ఎపిలాగే ఉత్తర ప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చూసి అమెరికా, ఇంగ్లాండ్ దేశాలే విస్తుపోతున్నాయన్నారు. ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా విదేశీ నిరుద్యోగులు హైదరాబాద్ వస్తున్నారని అన్నారు.
మరోవైపు అమెథీలో రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు తిరగబడాలని ఆమె సూచించారు. మాయావతి ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహించిందని ఆరోపించారు. మాయావతి ప్రజల ధనాన్ని దోచుకున్నారని దుయ్యబట్టారు. తప్పుడు హామీలతో ఎవరూ మోసపోవద్దని సూచించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెసు మారుస్తుందని, ఆ మార్పుకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. అభివృద్ధే ప్రధాన అజెండాగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. యుపిలో కాంగ్రెసు ప్రభుత్వం విధిగా ఏర్పడుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. మాయా ప్రభుత్వంతో ప్రజలు విసిగి పోయారన్నారు. అవినీతి హెచ్చుమీరిందన్నారు.