మందలించిందని మహిళా టీచర్‌ను హత్య చేసిన విద్యార్థి

గురువారం, ఫిబ్రవరి 9, 2012, 16:09 [IST]
Chennai Map
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో గురువారం ఘోరం జరిగింది. ఓ విద్యార్థి ఉపాధ్యాయురాలిని పొడిచి చంపిన సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ తనను మందలించిందని తొమ్మిదో తరగతి విద్యార్థి తరగతి గదిలోనే ఆమెను కత్తితో పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి పోయింది. విద్యార్థులు దిగ్బ్రాంతికి గురవడంతో పాటు భయానికి గురయ్యారు. మృతి చెందిన ఉపాధ్యాయురాలి పేరు ఉమా మహేశ్వరి. ఆమె వయస్సు 40. టీచర్‌ను పొడిచిన విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల యాజమాన్యం చెప్పిన వివరాల మేరకు.. ఉమా మహేశ్వరి పాఠశాలలో సైన్స్, హిందీ బోధిస్తోంది. ఈమె చాలా స్ట్రిక్ట్ టీచర్. సదరు విద్యార్థి గురించి టీచర్ గతంలోనే అతని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా అతను సరిగ్గా చదవక పోవడంతో మందలించడంతో పాటు పలుమార్లు కొట్టింది.

ఈమె విద్యార్థుల పట్ల చాలా శ్రద్ధ తీసుకునేదని, పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పేదని, అయితే ఆ విద్యార్థి ఆమెను ఎందుకు చంపాడో మాత్రం తెలియకుండా ఉన్నదని పాఠశాల ప్రిన్సిపల్ చెప్పారు. ఉమా మహేశ్వరి నాలుగో పీరియడ్ స్టార్ట్ చేసేందుకు తరగతి గదిలోకి వెళ్లిన సమయంలో అతను ఆమె గొంతు, కడుపులో పొడిచాడు. ఆమె అరుపులతో విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు అక్కడకు పరుగెత్తుకెళ్లారు. పొడిచిన విద్యార్థిని పట్టుకున్నారు. ఉమా మహేశ్వరి మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు.
English summary
A Class 9 student has allegedly killed a teacher inside the classroom of a private school in Chennai on Thursday.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets