పట్టాయా సింగిల్స్, డబుల్స్‌ క్వార్ట్‌ర్స్‌లో సానియా

శుక్రవారం, ఫిబ్రవరి 10, 2012, 11:56 [IST]
Sania Mirza
పట్టాయా: భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా పట్టాయా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో సింగిల్స్‌, డబుల్స్‌ రెండు విభాగాల్లోనూ క్వార్టర్స్‌కు చేరుకుంది. గురువారం జరిగిన రెండో రౌండ్‌ సింగిల్స్‌ మ్యాచ్‌లో సానియా 6-4, 7-5 తేడాతో బ్రిటన్‌ క్రీడాకారిణి 88వ ర్యాంకర్‌ అన్నే కేతోవాంగ్‌పై విజయం సాధించింది. 111వ ర్యాంకర్‌ సానియా గంటా 40 నిమిషాల్లో మ్యాచ్‌ ముగించింది. కేతోవాంగ్‌ తొలి రౌండ్‌ ప్రపంచ 16వ ర్యాంకర్‌ కిబుల్‌కోవా (స్లోవాకియా)కు షాకిచ్చింది.రెండో సెట్‌లో కీతవాంగ్‌ కాస్త ప్రతిఘటించినా సానియా సునాయాసంగా తిప్పికొట్టి క్వార్టర్స్‌ కు చేరుకుంది.

సానియా డబుల్స్‌లో ఆస్ట్రేలియా పార్ట్‌నర్‌ అనస్తియా రొడియోనోవాతో కలిసి క్వార్టర్స్‌కు చేరింది. డబుల్స్ తొలిరౌండ్‌లో సానియా - అనస్తాసియా రొడినోవా(ఆస్టేలియా) జోడి 6-0, 6-2తో ఫ్రాన్స్ జంట బెర్మాండ్ - కరోలిన్‌లను కంగుతినిపించింది.
ఇక క్వార్టర్స్‌లో వార్చెయా - వరుణ్య వాంగ్ టెంచాయ్ (ధాయ్ లాండ్)లను సానియా జోడీ ఎదుర్కోనుంది.
English summary
Sania Mirza dug deep into her reserves to overcome a fighting Anne Keothavong 6-4, 7-5 to progress to the singles quarterfinals of the $220,000 Pattaya Open, on Thursday.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets