లండన్: హైదరాబాదుకు చెందిన ఓ తెలుగు విద్యార్థిపై లండన్‌లో దాడి జరిగింది. దుండగులు ప్రవీణ్ రెడ్డి అనే హైదరాబాదీపై దాడి చేసి గాయపరిచారు. తీవ్రమైన గాయాలతో అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ సమాచారాన్ని హైదరాబాదులోని కుటుంబ సభ్యులకు అందించారు. కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
శుక్రవారంనాడు తన మిత్రులతో కలిసి ప్రవీణ్ రెడ్డి బయటకు వెళ్లాడు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కత్తులతో దాడి చేశారు. ప్రవీణ్ రెడ్డి కుటుంబం హైదరాబాదులోని ఎల్బీ నగర్‌లో నివాసం ఉంటోంది. తండ్రి సుధాకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ప్రవీణ్ రెడ్డి లండన్‌లో ఎంబిఎ చదువుతున్నాడు.