జుడాలను మళ్లీ చర్చలకు పిలవం: కొండ్రు, సమ్మెపై ఫైర్

ఆదివారం, ఫిబ్రవరి 12, 2012, 14:58 [IST]
Kondru Murali
హైదరాబాద్: జూనియర్ డాక్టర్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. అనంతరం మంత్రి కొండ్రు మురళి, శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. స్టైఫండ్ విషయంలో జుడాలు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేవని కొండ్రు మురళి చెప్పారు. జుడాలను మళ్లీ చర్చలకు పిలవవద్దని నిర్ణయించుకున్నామన్నారు. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా స్టైఫండ్ ఇస్తున్నామని ఇక పెంచకూడదని నిర్ణయించుకున్నామని చెప్పారు. వైద్య విద్యార్థుల డిమాండ్లకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నప్పటికీ వారు బెట్టుకు పోతున్నారని విమర్శించారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. జుడాలు తమ పట్టు వీడటం లేదన్నారు.

ఇంకా పెంచాలని వారు డిమాండ్ చేయడం సరికాదన్నారు. ఎమర్జెన్సీ సర్వీసులు ఎక్కడా ఆగలేదన్నారు. జుడాలు మెట్టు దిగి సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడం ఇష్టం లేకే జూడాలు స్టైఫండ్ పెంపును ముందుకు తెచ్చారని అనుమానం వ్యక్తం మరో మంత్రి శైలజానాథ్. గొంతెమ్మ కోర్కెలు సరికాదన్నారు. కొత్తగా 108 వాహనాలు కొనుగోలు చేసేందుకు సిఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు.
English summary
Government is ready to take serious action on junior doctors if they will not end strike. Minister Kondru Murali said government will not call JUDAs again for talks.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets