విజయవాడ: తమ పార్టీ నేత, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవిని ఏమైనా అంటే నాలుక కోస్తామని కృష్ణా జిల్లా కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు జోగి రమేష్, మల్లాది విష్ణు, శ్రీనివాస్‌లు ఆదివారం తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, జిల్లా టిడిపి అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వర రావును హెచ్చరించారు. ఉమలాంటి చిల్లర నేతల వ్యాఖ్యలకు తాము స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఆయనకు దమ్ముంటే భవానీ ద్వీపం లీజు వ్యవహారంపై అసెంబ్లీలో తేల్చుకోవాలి లేదా న్యాయ పోరాటం చేయాలని సూచించారు. దేవినేని మరోసారి చిరంజీవిపై వ్యాఖ్యలు చేస్తే తగిన రీతిలో బుద్ధి చెబుతామన్నారు. చిరంజీవి వర్గం మంత్రి గంటా శ్రీనివాస రావుకు చెందిన కంపెనీకి భవానీ ద్వీపం కాంట్రాక్టు కేటాయించడంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. రూ.298 కోట్ల కంటే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బినామీలు టెండరు వేసినా కాంట్రాక్టు అప్పగిస్తామన్నారు.
చంద్రబాబుతో భవానీ ద్వీపంపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. విజయవాడ కనక దుర్మమ్మపై ప్రమాణం చేసి టిడిపి ఎమ్మెల్యేలు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ ద్వీపం కాంట్రాక్టుపై న్యాయ విచారణకు తాము సిద్ధమన్నారు. కాగా భవానీ ద్వీపం కాంట్రాక్టును మంత్రి గంటా శ్రీనివాస రావుకు కేటాయించడం తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. గంటాకు కేటాయించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.