అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కండువాతోనే తాము అసెంబ్లీకి వెళతామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర రెడ్డి ఆదివారం అనంతపురం జిల్లాలో స్పష్టం చేశారు. అలాగే తమ పదిహేడు మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని సభాపతి నాదెండ్ల మనోహర్‌ను కోరతామని చెప్పారు. తాము వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలుగానే భావించుకుంటున్నామని ఆయన అన్నారు. స్పీకర్ తమపై వేటు వేసినా ఉప ఎన్నికలకు భయపడే సమస్యే లేదన్నారు. కాంగ్రెసు పార్టీ ఉప ఎన్నికలకు భయపడే తమ అనర్హత వేటు విషయంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. తమ రాజీనామాను ఆమోదించలేని దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెసు ఉందన్నారు. సభలో రైతు, చేనేత సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు.
కాగా పార్టీ జారీ చేసిన విప్ ధిక్కరిస్తూ గత సంవత్సరం డిసెంబర్ ఆరో తేదిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసానికి మద్దతుగా జగన్ వర్గానికి చెందిన పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఓటు వేసిన విషయం తెలిసిందే. వారిపై ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. ఇటు తెలంగాణ, అటు సీమాంధ్రలో ఒకేసారి ఉప ఎన్నికలు వస్తే ఎదుర్కోవడం కష్టమనే ఉద్దేశ్యంతోనే వారిపై అనర్హత వేటు విషయంలో జాప్యం జరుగుతుందని విపక్షాలు ఆరోపిస్తున్నారు. విప్ ధిక్కరించి, స్పీకర్ వివరణ తీసుకోవడం కూడా పూర్తయింది. అయితే ఇప్పటి వరకు స్పీకర్ వారిపై నిర్ణయం తీసుకోలేదు.