గుంటూరు: కృష్ణా జిల్లా కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలను సమర్థించినట్లుగా మాట్లాడారు. ఆయన ఆదివారం గుంటూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సూటుకేసులు ఇచ్చి మంత్రి పదవులు పొందే సంస్కృతి కాంగ్రెసు పార్టీలోనే లేదని అన్ని పార్టీలలో ఉందని ఆయన అన్నారు. దేశం కోసం పని చేసే రాజకీయ నేతలు కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసు పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు లేదన్న భావన చాలామందిలో ఉందన్నారు. పార్టీలో కొందరికి అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమేనని అన్నారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందని, ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు ఇది రుచించడం లేదన్నారు.
కాంగ్రెసు పార్టీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కంటే సీనియర్లు చాలా మంది ఉన్నారన్నారు. అలాంటి సీనియర్లలో కొందరు తామే ముఖ్యమంత్రి అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాగా ఇటీవల మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. సిఎంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ కూడా రాసినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఆయన మాట్లాడుతూ పార్టీలో చాలామంది సూటుకేసులతో వెళ్లి పదవులు తెచ్చుకుంటున్నారని, తనకు అలాంటి అవసరం లేదని అన్నారు.