లండన్: ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన వైద్య విద్యార్థి ప్రవీణ్ రెడ్డిపై దాడి జరిగిన సంఘటనలో స్కాట్లాండ్ పోలీసులు ముగ్గురు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. ప్రవీణ్ రెడ్డిపై దాడి చేసిన ఘటనలో పదకొండు మంది ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దాడి సూత్రదారి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. సంతోష్, అరౌ, సాయిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండుకు తరలించారు. కాగా ప్రవీణ్ రెడ్డి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. దాడి ఘటనపై జోక్యం చేసుకున్న విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ ప్రవీణ్ తల్లిదండ్రులకు వీసా మంజూరు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. వారు లండన్ బయలుదేరి వెళ్లారు. ప్రవీణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కాగా లండన్‌లోని లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంటులో ఎంబిఏ ఆఖరి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్ శుక్రవారం రాత్రి కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. నల్లగొండ జిల్లా పోచంపల్లి మండలం దేశ్‌ముఖ్ గ్రామానికి చెందిన జంగం సుధాకర్ రెడ్డి, జ్యోతి దంపతుల చిన్న కుమారుడు ప్రవీణ్ రెడ్డి. వీరు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని మన్సూరాబాదు డివిజన్ చింతలకంట సమీపంలోని ప్రగతి నగర్ కాలనీలో ఉంటున్నారు. తండ్రి సుధాకర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి.