చంద్రబాబు మిమిక్రీ ఆర్టిస్టులా మారారు: లక్ష్మీ పార్వతి

సోమవారం, ఫిబ్రవరి 13, 2012, 15:59 [IST]
Laxmi Parvathi
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మిమిక్రీ ఆర్టిస్టులా మారిపోయారని ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి సోమవారం విమర్శించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ధర్మవరంలో చేస్తున్న దీక్షకు ఆమె మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ఓ ఛానల్‌తో మాట్లాడారు. సామాజిక సంఘ సంస్కర్త అన్నా హజారే అవినీతిపై ఢిల్లీలో పోరాటం చేస్తే చంద్రబాబు ఇక్కడ చేశారని, జగన్ విద్యార్థుల కోసం, చేనేత కార్మికుల కోసం, రైతుల కోసం దీక్ష చేస్తుంటే బాబు ఆయన దారిలో నడుస్తున్నారని ఇలా ఎవరు దీక్షలు చేసినా ఆయన వాటిని అనుసరిస్తూ మిమిక్రీ ఆర్టిస్టులా మారిపోయారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో 200 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని దుయ్యబట్టారు. పరిహారం ఇస్తే ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పిన ప్రబుద్దుడు బాబు అని ధ్వజమెత్తారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేనేత కార్మికులను ఆదుకున్నారన్నారు.

వ్యవసాయం తర్వాత చేనేతకు దేశంలో ప్రాధాన్యత ఉందన్నారు. దానిని విస్మరించవద్దన్నారు. ఎన్టీఆర్, వైయస్ తర్వాత ప్రజా సమస్యలపై ఎవరైనా స్పందించారా అని ప్రశ్నించారు. జగన్ మాత్రమే వారి దారిలో నడుస్తున్నారన్నారు. బాబు హయాంలో చేనేత రంగం ఎంతగా క్షీణించిందో అందరికీ తెలుసునన్నారు. రాష్ట్రంలోని పలు సమస్యలపై జగన్ దీక్షలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళుతున్నారన్నారు. చేనేత రంగ పరిష్కారానికి కాంగ్రెసు ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. వైయస్ రూ.350 కోట్లు విడుదల చేస్తే రూ.150 కోట్లు ఇచ్చి కిరణ్ ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. కిరణ్ బాబు అడుగుజాడల్లో నడుస్తున్నారని ఆరోపించారు.
English summary
Laxmi Parvathi said that TDP chief Nara Chandrababu Naidu changes as mimicry artist.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets