న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వేసిన పిటిషన్‌కు సుప్రీం కోర్టులో సోమవారం నిరాశ ఎదురైంది. అదే సమయంలో ఎమ్మార్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రపై విచారణ జరపాలన్న పిటిషన్‌కు కోర్టు తోసి పుచ్చింది. సోమవారం ఒకేరోజు సుప్రీం కోర్టు ముందుకు మూడు పిటిషన్లు వచ్చాయి. ఎమ్మార్ పైన సిబిఐ విచారణ జరపాలన్న హైకోర్టు తీర్పును నిలిపి వేయాలని ఎమ్మార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసులో ఇప్పటికే విచారణ ప్రారంభమై ఛార్జీషీట్ దాఖలు చేసినందున ఈ పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోవడం కుదరదని సుప్రీం తేల్చి చెప్పింది. అయితే ఎమ్మార్ కేసులో ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా విచారణ జరపాలని సుప్రీం కోర్టు సిబిఐని ఆదేశించింది.
మరోవైపు జగన్ ఆస్తుల కేసులో సిబిఐ విచారణ నిలిపి వేయాలని జగతి పబ్లికేషన్స్, సండూరు పవర్ వేసిన పిటిషన్లు సోమవారం కోర్టు ముందుకు వచ్చాయి. ఈ రెండు పిటిషన్లను కోర్టు కొట్టి వేసింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో తాము జోక్యం చేసుకోమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. మధ్యలో ఆపివేయడం సాధ్యం కాదని చెప్పింది. ఎలాంటి అక్రమాలు లేకుంటే విచారణకు సహకరించాలని పిటిషన్ దారులకు సూచిస్తూ ఆ పిటిషన్లను కొట్టి వేసింది.
మరోవైపు ఎమ్మార్ కేసులో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పాత్రను విచారించాలని ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు బీంరెడ్డి ఎల్లారెడ్డి వేసిన పిటిషన్‌ను కోర్టు తోసి పుచ్చింది. బాబు హయాంలో ఎమ్మార్‌లో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని సిబిఐ ప్రతిపక్ష నేతకు క్లీన్ చిట్ ఇచ్చింది. తాము 2000 సంవత్సరం నుండి విచారణ చేస్తున్నామని తెలిపారు. సిబిఐ వాదనతో సుప్రీం సంతృప్తి చెందింది. సుప్రీం భీంరెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చింది.