హైదరాబాద్: తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవి గురువారం సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధతో చలోక్తిగా మాట్లాడారు. ఏదో డ్యూయెట్ గుర్తుకు వస్తుందంటూ చిరంజీవి ఆమెతో నవ్వుతూ అన్నారు. గురువారం ఉదయం చిరంజీవిని చూసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు.. ఏమండీ చిరంజీవి గారు బాగా సన్నబడ్డారు.. గ్రామర్ ఏమాత్రం తగ్గలేదు అంటూ కితాబిచ్చారు. అదే సమయంలో జయసుధ అక్కడకు వచ్చారు. ఆమె రాకను గమనించిన చిరంజీవి ఆమెతో... జయసుధ గారు మోత్కుపల్లి నన్ను స్లిమ్ అయ్యావని, గ్లామర్ తగ్గలేదని అంటున్నారు.. ఇంతలో మీరు కనిపించారు.. ఏదో డ్యూయెట్ గుర్తుకు వస్తోంది.. మనం ఇక్కడే ఉంటే మోత్కుపల్లి మ్యూజిక్ ఇస్తున్నట్లు ఊహించుకుంటారు పద అంటూ నవ్వుతూ వెళ్లిపోయారు. దీంతో వారి మధ్య నవ్వులు విరిశాయి.
మూడు రోజుల క్రితం ప్రేమికుల దినోత్సవం రోజు పయ్యావుల కేశవ్ కూడా చిరంజీవిపై ఆసక్తికంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ రోజు అసెంబ్లీకి మీరే హాట్ అని, ప్రేమికుల దినోత్సవం రోజు మీరే సెంటర్ అట్రాక్షన్ అని అన్నారు. అందుకు చిరంజీవి ఎందుకు అని అడగ్గా అందుకు పయ్యావుల.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఐ లవ్యూ అంటూ మీ వెంట పడుతున్నారు కదా అని అన్నారు. అందుకు చిరంజీవి నవ్వుతూ వెళ్లి పోయారు.