అసెంబ్లీ నుంచి 12 మంది తెరాస ఎమ్మెల్యేల సస్పెన్షన్

శుక్రవారం, ఫిబ్రవరి 17, 2012, 10:49 [IST]
Assembly
హైదరాబాద్: సభా కార్యక్రమాలను అడ్డుకుంటుండడంతో 12 మంది తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులను స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఒక రోజు పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. శుక్రవారం ఉదయం సభ సమావేశం కాగానే తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ, ఉప ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్‌ను ప్రతిపాదించకూడాదని కోరుతూ తెరాస శాసనసభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో తొలుత సభను స్పీకర్ అర గంట పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ నాదెండ్ల మనోహర్ ఆదేశాలు జారీ చేశారు.

సోమారపు సత్యనారాయణ, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్, కెటి రామారావు, హరీశ్వర్ రావు, కావేటి సమ్మయ్య, చెన్నమనేని రమేష్, వినయ భాస్కర్, పోచారం శ్రీనివాస రెడ్డి, ఓదేలు, ఏనుగు రవీంద్రా రెడ్డి, అరవింద్ రెడ్డిలను స్పీకర్ సస్పెండ్ చేశారు. సస్పెండయిన శానససభ్యులు బయటకు వెళ్లిపోవాలని ఆయన ఆదేశించారు. తెలంగాణపై ప్రభుత్వ తీరుకు నిరసనగా సిపిఐ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తెలంగాణ కోసం తీర్మానం ప్రతిపాదిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి వెనక్కి పోయినందుకు నిరసనగా బిజెపి సభ్యులు కూడా వాకౌట్ చేశారు.

English summary
TRS MLAs suspended from Assembly for oneday as they are obstructing session.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets