స్త్రీల మొబైల్స్ ఆసక్తిపై జైరాం వివాదాస్పద వ్యాఖ్య

శుక్రవారం, ఫిబ్రవరి 17, 2012, 16:48 [IST]
Jairam Ramesh
న్యూఢిల్లీ: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ మహిళలపై వివాదాస్పద వ్యాఖ్య చేశారు. మహిళలు టాయిలెట్స్ డిమాండ్ చేయడం లేదని, మొబైల్స్‌ను డిమాండ్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పారిశుధ్యం అత్యంత క్లిష్టమైన సమస్య అని, ప్రవర్తనా మార్పుల గురించి ప్రస్తావించినప్పుడు ఇప్పుడు మహిళలు మొబైల్స్ అడుగుతున్నారని ఆయన అన్నారు. ఆసియా - ఫసిఫిక్ మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన శుక్రవారం మాట్లాడారు.

భారతదేశం వైరుధ్యాలమయమని, దేశంలోని 60 శాతం మంది బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలు చేస్తారని, అదే దేశంలో 700 మిలియన్ల మొబైల్ ఫోన్లున్నాయని ఆయన అన్నారు. టాయిలెట్లు నిర్మించినప్పటికీ వాటిని వాడరని ఆయన అన్నారు. మంచినీరు, పారిశుధ్య శాఖను కూడా నిర్వహిస్తున్న జైరాం రమేష్ త్వరలోనే పరిస్థితిని మారుస్తామని చెప్పారు. మహిళలు టాయిలెట్లను వాడకపోవడానికి గల కారణం అడగ్గా కొన్ని సాంస్కృతి నియమాలు పనిచేస్తున్నాయని జవాబిచ్చారు. మహిళ స్వయం సహాయక గ్రూపులకు టాయిలెట్ల నిర్మాణం ప్రధానమైన అంశం కావాలని ఆయన అన్నారు.

గుజరాత్‌లో 1970లో పాల ఉత్పత్తి విషయంలో వచ్చిన శ్వేత విప్లవంపై గ్రామీణ మహిళల్లో వచ్చిన మార్పును శ్యాంబెనెగల్ మంథన్ సినిమా ద్వారా చూపించారని గుర్తు చేస్తూ పారిశుధ్యంపై బెంగాల్ ఓ సినిమా నిర్మించాలని అన్నారు. సామాజిక నిబంధనలను బద్దలు కొట్టడానికి మంథన్ మాదిరిగా టాయిలెట్ల వాడకంపై ఓ సినిమా పశ్చిమ బెంగాల్ నిర్మించగలదని ఆయన అన్నారు.
English summary
''Women demand mobile phones, they are not demanding toilets,'' lamented Rural Development Minister Jairam Ramesh today in remarks that could create a controversy.
User Comments
Vedapanditaha Sannidhanam Dixit Sarma 18 Feb 2012 03:44 pm
జైరాం సరిగ్గా చెప్పాడు
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets