పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి 23 మంది మృతి

శుక్రవారం, ఫిబ్రవరి 17, 2012, 19:38 [IST]
Pakistan
పెషావర్: పాకిస్తాన్‌లో ఈశాన్య ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 23 మంది మరణించారు 50 మంది దాకా గాయపడ్డారు. అఫ్గనిస్తాన్‌ సరిహద్దుకు సమీపంలోని పరాచినార్ అనే పట్టణంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మోటార్ సైకిల్‌పై ఓ వ్యక్తి మార్కెట్లో తనను తాను పేల్చేసుకున్నాడు. మృతులు షియాలు.

షియాలపై సున్నీలు దాడి చేయడం పాకిస్తాన్‌లో సర్వసాధారణంగా మారింది. దుకాణాలు ప్రజలతో రద్దీగా ఉన్న సమయంలో దాడి జరిగిందని స్థానిక ప్రభుత్వ నిర్వాహకుడు వాజిద్ అలీ చెప్పారు. ఈ దాడికి పాల్పడింది తామేనని స్థానిక తాలిబన్ కమాండర్ ఫజల్ సయీద్ హక్కానీ చెప్పాడు. సున్నీలపై షియాలు దాడి చేస్తున్నందున్నే తాము ఈ చర్యకు పాల్పడ్డామని అతను చెప్పుకున్నాడు. పాకిస్తాన్‌లో గత ఐదేళ్లలో వందలాది ఆత్మాహుతి దాడులు జరిగాయి.
English summary
A suicide attacker on a motorcycle blew himself up in a market in a Pakistani town close to the Afghan border on Friday, killing 23 Shiite Muslims and wounding 50 people, officials said.
User Comments
Narasimha Thota 18 Feb 2012 03:55 am
మళ్ళీ ఈ ఇస్లాం లో సున్ని లేమిటి, షియాలేమిటి? మొహమ్మద్ ప్రవక్త కొత్త మతాన్ని పెట్టి కొత్త రాతి యుగాన్ని ప్రారంభించింది ఇలా కొట్టుకు చావడానికి కాదు.
Vikram 20 Aug 2008 07:26 am
baagaa cheppaavu guru. aa site (greatandhra) oka yellow hournalism type site. anthaa kalpithaale` raasthuntaaru. antha oka side` raasthaaru. annee abhadhaale.aaa site lo vacche` news vere` sites lo vundavu. chiru ki against kaabatti prathee` dhaantlo thappulu vedhiki theory theesi raasthaadu. chiru thadabaddaadani, TDP chetthani, chiru party meet flop(vaadu damp squib) ani raasaadu. Is it truth. alaa ayithe` migathaavaallu adhe` raayaaligaa. mari YSR CBN mother meedha comment chesaadu. adhi correct aa. can a person who's in top position can talk and make nonsense comments like that. congress vaallu edhee` aalochinchi maatlaadaru. adhe` 120 ellaagaa vaallu nerchukunnadhi. mallee` 30 years industry laanti sollu kaburlu chepthuntaaru state ki annee` chesesaaranta. oka saari survey cheukuni choosukomanandi, they will come to know how happy people are. greatandhra is one dhagulbhaaji site and hope the site gets blocked soon and none opens it. better they only put spicy gallery' to improve the hits. Moron site. Foolish site. Boku site. Telangana prajalaki kopam vacche` site (greatandhraa ane` peru valla as they might think telangana great kaadhaa ani) evarevaru e` kulamo veedokkade` ekkuvagaa raasthaadu. that means he's encouraging casteism. ituvanti sites internet jaathi ke` virus and AIDS type of sites.
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets