కోర్టులో ఏడ్చేసిన జయలలిత మాజీ సఖి శశికళ

శనివారం, ఫిబ్రవరి 18, 2012, 15:15 [IST]
Sasikala
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాజీ సఖి శశికళ శనివారం కర్ణాటక కోర్టులో ఏడ్చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నటరాజన్ శనివారం కర్ణాటక కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో జయలలితతో పాటు శశికళ కూడా నిందితురాలు. ఈ కేసుతో జయలలితకు సంబంధం లేదని శశికళ కోర్టుకు చెప్పారున.

శశి ఎంటర్‌ప్రైజెస్ ఖాతాలను తాను ఒక్కదాన్నే నిర్వహించానని, ఈ కంపెనీలో జయలలిత ప్రచ్ఛన్న భాగస్వామి మాత్రమేనని ఆమె చెప్పారు. 1991 - 1996 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత 66 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారనే ఆరోపణపై ఈ కేసు నడుస్తోంది. కోర్టులో వాంగ్మూలం ఇచ్చే సమయంలో శశికళ ఒక్కసారిగా ఏడ్చేసినట్లు చెబుతున్నారు.
English summary
Tamil Nadu Chief Minister J Jayalalitha's estranged aide and co-accused in the disproportionate assets case, Sasikala Natarajan on Saturday reportedly broke down in court while recording of statement in the case.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets