జయలలిత మాజీ సఖి శశికళ భర్త నటరాజన్ ఆరెస్టు

శనివారం, ఫిబ్రవరి 18, 2012, 21:07 [IST]
Sasikala
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాజీ ప్రియసఖి శశికళ భర్తన నటరాజన్‌ను చెన్నై పోలీసులు శనివారం అరెస్టు చేశారు. భూకబ్జా కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. తంజవూరులో ఆయనపై ఈ కేసు నమోదైంది. జయలలితకు చాలా ఏళ్లు శశికళ అత్యంత సన్నిహితురాలిగా ఉన్నారు. నిరుడు డిసెంబర్‌లో జయలలిత శశికళను, ఆమె బంధువులు అన్నాడియంకె నుంచి బహిష్కరించారు.

శశికళ, ఆమె బంధువులు పార్టీలో, ప్రభుత్వంలో అదుపు లేకుండా జోక్యం చేసుకుంటున్నారనే ఉద్దేశంతో వారిని ఆమె బహిష్కరించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ శనివారంనాడే కర్ణాటక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో జయలలితతో పాటు శశికళ కూడా నిందితురాలు. ఈ కేసుతో జయలలితకు సంబంధం లేదని శశికళ కోర్టుకు చెప్పారు.

శశి ఎంటర్‌ప్రైజెస్ ఖాతాలను తాను ఒక్కదాన్నే నిర్వహించానని, ఈ కంపెనీలో జయలలిత ప్రచ్ఛన్న భాగస్వామి మాత్రమేనని ఆమె చెప్పారు. 1991 - 1996 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జయలలిత 66 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారనే ఆరోపణపై ఈ కేసు నడుస్తోంది. కోర్టులో వాంగ్మూలం ఇచ్చే సమయంలో శశికళ ఒక్కసారిగా ఏడ్చేసినట్లు చెబుతున్నారు.
English summary
Adding to the woes of Sasikala and her family, the Chennai Police on Saturday arrested her husband, Natarajan in connection with a land grabbing case.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets