జగన్ వర్గంపై చర్యలు తీసుకోవడం లేదేం?: నారాయణ

ఆదివారం, ఫిబ్రవరి 19, 2012, 14:26 [IST]
Narayana
హైదరాబాద్: పార్టీ విప్ ధిక్కరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులపై కాంగ్రెసు పార్టీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆదివారం ప్రశ్నించారు. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై తాము ఇంకా నిర్ణయించలేదన్నారు. ఈ నెల 21న జరిగే పార్టీ మహాసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకునే ముందు సిపిఎం పార్టీ తమతో మాట మాత్రమైనా చెప్పలేదని ఆయన అన్నారు. ఎన్నికల్లో కలిసి ఉండవచ్చు లేదా విడిపోవచ్చునని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలపై ఉద్యమాల విషయంలో మాత్రం రెండు పార్టీలు కలిసే వెళతాయన్నారు.

మారుతున్న రాజకీయ పరిస్థితిల్లో మార్పులు తప్పని సరి అన్నారు. కాంగ్రెసు, బిజెపి వంటి ప్రజావ్యతిరేక ప్రభుత్వాలను అధికారంలోకి తీసుకు రాకూడదనుకుంటే బూర్జువా పార్టీలతో కలువక తప్పదన్నారు. అసెంబ్లీని పందుల దొడ్డి అన్న తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. పోలవరం టెండర్ల అవినీతికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీయే కారణమని ఆరోపించారు.
English summary
CPI Narayana demanded Congress government to take action on YSR Congress
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets