ఉపఎన్నికలతో తెలంగాణరాదు, బహిష్కరించాలి: ఎర్రబెల్లి

ఆదివారం, ఫిబ్రవరి 19, 2012, 16:20 [IST]
Errabelli Dayakar Rao
వరంగల్/మహబూబ్ నగర్: ఉప ఎన్నికలతో ప్రత్యేక తెలంగాణ రాదని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం వరంగల్ జిల్లాలో అన్నారు. ఉప ఎన్నికలకు తెలంగాణ అంశానికి ఏమాత్రం సంబంధం లేదని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాజకీయ పెద్దల కోసమే ఈ ఉప ఎన్నికలు తీసుకు వచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ సెంటిమెంట్ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ఎన్నికలు బహిష్కరించాలని ఆయన కెసిఆర్‌కు సవాల్ విసిరారు. తెలంగాణను కెసిఆర్ ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. సొంత రాజకీయ లబ్ధి కోసమే ఉప ఎన్నికలు అన్నారు.

తెలంగాణ ముసుగులో కెసిఆర్ కోట్లాది రూపాయలు కూడబెట్టారని మరో నేత దేవేందర్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లాలో అన్నారు. తెలంగాణను సర్వనాశనం చేసిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి గతంలో మాజీ మంత్రి, ఇప్పటి టిఆర్ఎస్ అభ్యర్థి జూపల్లి కృష్ణా రావు మద్దతు ఇచ్చారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమన్నారు.
English summary
TDP senior MLA Errabelli Dayakar rao said that Telangana will not come with by election.
User Comments
Srsr Velagala 19 Feb 2012 07:32 pm
ఈ తెలుగు దేశం పార్టి వాళ్ళని గమనిస్తుంటే మన ప్రాచిన నీతి కధలలో ఒకటి గుర్తుకోస్తుంటది, జన్మతః వచ్చిన ఆయా జీవుల లక్షణాలు ఎంతటి పండితుడైనా తన జ్ఞాన సంపత్తితో వాటిని సమూలంగా మార్చలేదు, వాటి గుణాలు కాని అక్కారం గాని పోదు, ఆదినుండి కాస్త ఉనికి పేరు మార్చుకున్న మన జాతీయ పార్టికి ఉండే కొన్ని దులక్షణలు వీటికి చాల ఎక్కువ, అవకాసం దొరుకుటే దేశాన్ని నాశనం చేయగలవు కాబట్టే అప్పుడప్పుడు వచ్చే కరువు కాటకాల లాగ వీటికి అధికార యోగం వస్తుంటది,అప్పుడు వచ్చే మార్పులకి ప్రజలు చాల ఇబ్బంది పడతారు,
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets