ఈ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఉండదు: జైపాల్ రెడ్డి

ఆదివారం, ఫిబ్రవరి 19, 2012, 11:37 [IST]
Jaipal Reddy
రాజమండ్రి: ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఉండదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో స్పష్టం చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టే అవకాశం లేదని ఆయన చెప్పారు. బిల్లు విషయంలో కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలంగాణ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ముందు ఆ అంశంపై చర్చ జరగాల్సి ఉందని అన్నారు. కేంద్రానిదే తుది నిర్ణయమని చెప్పారు. కేంద్ర మంత్రిగా తాను ప్రస్తుతం ఈ అంశంపై ఇంతకంటే ఎక్కువగా మాట్లాడనని చెప్పారు.

ఈసారి పెట్రోల్ ధరల పెంపు జాతీయ విపత్తులాంటిదని ఆయన పేర్కొన్నారు. పెట్రోల్ ధరల పెంపుపై రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు ధరల పెంపును రాజకీయం చేయవద్దని సూచించారు. ప్రభుత్వం ఎలాంటి రాయితీలు, రేట్లు పెంచక పోవడంవల్ల పెట్రోలుపై రూ.లక్షన్నర కోట్లు, డీజిల్‌పై రూ.80వేల కోట్లు, ఎల్పీజిపై రూ.25 వేల కోట్లు, కిరోసిన్‌పై రూ.30వేల కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు.
English summary
Central Minister Jaipal Reddy said that centre will not propose Telangana bill in this sessions.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets