మీరు ఇళ్లలో బ్లూఫిలిమ్స్ చూడరా?: మాజీ సిఎం యడ్డీ

ఆదివారం, ఫిబ్రవరి 19, 2012, 10:14 [IST]
Yeddyurappa
బెంగళూరు: మీరు ఇళ్లలో నీలి చిత్రాలు చూడరా అంటూ మీడియాపై మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యడ్యూరప్ప శనివారం విరుచుకు పడ్డారు. ఆయన శివమొగ్గలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నీలి చిత్రాల అంశంపై విలేకరులు ఆయనను ప్రశ్నించారు. దీంతో ఆయన వారిపై విరుచుకు పడ్డారు. మీరు ఇళ్లలో రాత్రిపూట నీలి చిత్రాలు చూడరా తెలిసో తెలియకో కొందరు ఎమ్మెల్యేలు తప్పు చేశారు, దాన్ని ఎందుకు ఇంత పెద్దగా చేసి చూపుతారని ప్రశ్నించారు.

ఏ విషయానికి ప్రాధాన్యత ఇవ్వాలో అంతే ఇవ్వాలని, నీలి చిత్రాల అంశం ఘటనను పత్రికలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడం సరికాదన్నారు. కాగా ఇటీవల అసెంబ్లీలో బిజెపికి చెందిన మంత్రులు నిండు సభలోనే నీలి చిత్రాలు చూస్తూ కెమెరాలకు చిక్కి పోయిన విషయం తెలిసిందే. వారిపై పార్టీ వేటు వేసింది.
English summary
Karnataka former CM Yeddyurappa fired at media on saturday for their question about leaders who saw bluefilms in Assembly.
User Comments
Narasimha Thota 20 Feb 2012 08:22 am
ఒరేయ్ ఎడ్డి బాడ్కోవ్, విలేఖరులు నీలి చిత్రాలు చూస్తారా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. స్త్రీ మరియు శిశు శాఖా మంత్రి అసెంబ్లీ లో నీలి చిత్రం చూడటం అమానుషం. అందరూ చేసుకునేదే కదా అని నీలిచిత్రాలను లీగల్ చేయలేము కదా. నిన్ను, నీ తొట్టి మంత్రుల్ని ఉరి తీయాలి.
RamachandraRao 19 Feb 2012 10:47 pm
అసెంబ్లీలో, నిండు సభలో నీలి చిత్రాలు చూడడం చిన్న విషయమా? అది తెలిసో, తెలియకో చేసిన తప్పా? మంచీ చెడూ తెలియక పోవడానికి సదరు మంత్రులేమైనా పసిపిల్లలా? ఆహా, ఎంత చక్కగా వెనకేసుకు వచ్చారు మాజీ ముఖ్యమంత్రి గారు!!
[ మీ వ్యాఖ్య రాయండి ]
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets