వైయస్‌ లాంటి ముఖ్యమంత్రి ఉంటే..: జగన్ వర్గం పిల్లి

సోమవారం, ఫిబ్రవరి 20, 2012, 17:34 [IST]
Pilli Subhash Chandra Bose
కాకినాడ/హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వంటి ముఖ్యమంత్రి ఉంటే తాను ఉన్నత చదువులు చదివి ఉండేవాడినని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోసు సోమవారం అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా పిల్లి సుభాష్ చంద్ర బోసు తూర్పు గోదావరి జిల్లాలోని శివాలయాలను సందర్శించారు. ఆ తర్వాత అనపర్తి నియోజకవర్గ పరిధిలోని గొల్ల్లల మామిడాడ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు, కార్యకర్తలు బోస్‌కు బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. స్థానిక శివాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన వైయస్ఆర్ ధ్యానమందిరాన్ని సందర్శించారు. కాగా ఇటీవల ఆయన తన నియోజకవర్గానికి నిధులు కేటాయించడం లేదంటూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

అవినీతి సొమ్ముతో స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో తాము పొత్తు పొట్టుకోమన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణపై హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత గట్టు రామచంద్ర రావు విరుచుకు పడ్డారు. నారాయణ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మౌత్ పీస్‌గా మారారని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే ఆఖరి పేజీలో వార్తలు రాసే ఆ రెండు పత్రికలు జగన్‌పై వ్యతిరేకంగా మాట్లాడితే మొదటి పేజీలో ఎందుకు వేశాయన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో రాసిన స్క్రిప్ట్‌ని ఈనాడు, దాని తోక పత్రికలు రాశాయని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి నారాయణ మాట్లాడిన మాటలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
English summary
YS Jaganmohan Reddy camp MLA Pilli Subash Chandra Bose praised late YS Rajasekhar Reddy.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets