ఇద్దరు భార్యలకు, కూతురికి నిప్పంటించిన భర్త

సోమవారం, ఫిబ్రవరి 20, 2012, 16:47 [IST]
Prakasam District
ఒంగోలు/ అనంతపురం: తప్ప తాగి ఒళ్లు తెలియని మైకంలో ఓ వ్యక్తి తన ఇద్దరు భార్యలకు, కూతురికి నిప్పంటించాడు. ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామంలో చోటు చేసుకుంది. నిత్యం మద్యం సేవించే షానూన్ అనే వ్యక్తి గత అర్థరాత్రి కూడా తప్పతాగి ఇంటికి వచ్చాడు. నిద్రపోతున్న ఇద్దరు భార్యలు కైరోల్, రాధా, కూతురు షాదినాలపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.

వారి కేకలకు ఇంట్లోనివారంతా లేచి మంటలను ఆర్పేశారు. అయితే అప్పటికే వారి శరీరాలు 50 శాతం కాలిపోయాయి. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మతిస్తిమితం లేని తల్లి కూతురు, కుమారుడి గొంతు కోసింది. దాంతో వారిద్దరు మరణించారు. ఆ తర్వాత ఆమె కూడా గొంతు కోసుకుంది. ఆమెను బళ్లారి ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
English summary
A boozed man attempted to murder his two wives and daughter in Prakasam district.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets