హైదరాబాద్: రంగా రెడ్డి జిల్లాలోని కీసర రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ నినాదాలు స్వాగతం చెప్పాయి. ఆయన మహా శివరాత్రి సందర్భంగా సోమవారం కీసర రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
చంద్రబాబు రాక సందర్భంగా సాధారణ భక్తులకు గంట పాటు స్వామివారి దర్శనాన్ని నిలిపేశారు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చంద్రబాబు వెంట పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ ఉన్నారు. చంద్రబాబును చూసి తెలంగాణవాదులు తెలంగాణ నినాదాలు చేశారు. ఆలయ అర్చకులు చందర్బాబుకు పూలమాల వేసి స్వాగతం చెప్పారు.