గోదావరి నదిలో మునిగి ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

సోమవారం, ఫిబ్రవరి 20, 2012, 13:01 [IST]
East Godavari Map
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదిలో మునిగి ఓ విద్యార్థి సోమవారం మృతి చెందాడు. రాజమండ్రిలోని కృష్ణ ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సూర్య మణి తేజ అనే విద్యార్థి తన స్నేహితులతో కలిసి ఉదయం పది గంటల ప్రాంతంలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లాడు. నదిలో ఈత కొడుతూ అతను లోతైన ప్రాంతానికి వెళ్లాడు.

లోతు ప్రాంతానికి వెళ్లడంతో వరద తాకిడి తట్టుకోలేక అతను నీళ్లలో మునిగి పోయాడు. అతనితో పాటే ఉన్న స్నేహితులు కూడా లోతు ప్రాంతానికి వెళ్లారు. వీరిని గమనించిన స్థానికులు విద్యార్థులను రక్షించారు. సూర్య తేజ అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
English summary
An Engineering student drown while swimming in Godavari river in East Godavari district.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets