త్వరగా తెలంగాణ రావాలని మొక్కుకున్నా: కెసిఆర్

సోమవారం, ఫిబ్రవరి 20, 2012, 14:58 [IST]
K Chandrasekhar Rao
కరీంనగర్: సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆలయాలకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వేములవాడ ఆలయానికి వంద ఎకరాల్లో కాటేజీ నిర్మిస్తామని ఆయన చెప్పారు. వచ్చే శివరాత్రి నాటికి తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఆయన సోమవారం కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నారు.

ఆయనతో పాటు తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్, పది మంది శాసనసభ్యులు రాజరాజేశ్వరీ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆలయాల అభివృద్ధి జరగదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం త్వరగా రావాలని స్వామివారిని మొక్కుకున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే శివరాత్రిని తెలంగాణలోని జరుపుకోవాలని ఆయన ఆశించారు.
English summary
TRS president K Chandrasekhar Rao said that Telangana temples will be neglected in United state
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Test , Lord's Cricket Ground, St John's Wood
England won by 5 wickets