బెంగళూరు: కర్ణాటక బిజెపిలో విభేదాలు ముదురుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను ముఖ్యమంత్రి సదానంద గౌడ నారదమునిగా అభివర్ణించారు. తిరిగి ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న యడ్యూరప్ప పలు పార్టీల శాసనసభ్యులకు ఫోన్లు చేయడాన్ని ప్రస్తావిస్తూ ఆ విధంగా అభివర్ణించారు. అయితే, యడ్యూరప్ప పేరును ఆయన ప్రస్తావించలేదు. నారదముని 14 లోకాలు సంచరించాడని, అయితే భగవంతుడిని నమ్మించలేకపోయాడని ఆయన తంకూరు జిల్లా కడుసిద్ధేశ్వర మఠంలో జరిగిన ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన ఆ విధంగా అన్నారు.
ఈ నెల23వ తేదీన యడ్యూరప్ప చింతన్ బైఠక్‌ను ఏర్పాటు చేసి వివిధ పార్టీలకు చెందిన శాసనసభ్యులను ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు రాబోతున్నాయని, మంచి జరుగుతుందని యడ్యూరప్ప అన్నారు. కొంత మంది మఠాలకు డబ్బులు ఇచ్చారని, అయితే మఠాలకు అంకితం కాలేదని సదానంద గౌడ యడ్యూరప్పను ఉద్దేశించి అన్నారు.