న్యూఢిల్లీ: మహిళల హాకీ ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత్ బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 4-1తో కెనడాను చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లో ఏకైక గోల్ చేసి భారత్‌ను గట్టెక్కించిన తెలుగుతేజం యెండల సౌందర్య మరోసారి మెరిసింది. 16వ నిమిషంలోనే సౌందర్య గోల్ చేసి భారత్‌కు శుభారంభాన్నందించింది. రాణీ రాంపాల్ (19వ), సుశీలా చాను (29వ), అనూరాధా దేవి (49) తలా గోల్ నమోదు చేశారు. కెనడా జట్టులో హన్నా హాన్ 69 ని మిషంలో ఏకైక గోల్ చేసింది.
ప్రారంభం నుంచి ఎదురు దాడి చేసిన భారత క్రీడాకారిణులు ఆద్యంతం మ్యాచ్‌పై పట్టుబిగించారు. తొలి మ్యాచ్‌లో భారత్ 1-1తో ఉక్రెయిన్‌పై డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. పాయింట్ల పట్టికలో భారత్ (3) ఇటలీతో కలసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో ఇటలీ 4-1తో పోలెండ్‌ను, దక్షిణాఫ్రికా 2-0తో ఉక్రెయిన్‌ను ఓడించాయి.