హైదరాబాద్: సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ అంటూ పార్టీ పెట్టిన చిరంజీవి కాంగ్రెసు కంపులో కలిసిపోయారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లా గజ్వెల్‌కు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), బిజెపి కార్యకర్తలు మంగళవారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిరంజీవి భ్రష్టుపట్టిపోయారని, మనలని కూడా భ్రష్టు పట్టిస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
తమ పార్టీని దెబ్బ తీయాలని కాంగ్రెసు పార్టీ ప్రయత్నాలు చేస్తోందని, తమ పార్టీని దెబ్బ తీయాలని ప్రయత్నించేవారే మనుగడ కోల్పోతారని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీతో తాము ఎప్పుడూ రాజీ పడలేదని, రాజీ పడబోమని ఆయన చెప్పారు. ముప్పయి ఏళ్లుగా తాము కాంగ్రెసుపై పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు.
సమాచార హక్కు కమిషనర్ల పేర్లు మార్చాలని తాను సూచించినా అదే ఫైలును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్‌కు పంపించారని, గవర్నర్ దాన్ని తిప్పికొట్టారని ఆయన అన్నారు. సమాచార కమిషనర్ల ఎంపికను తాను వ్యతిరేకించానని, అయితే ఏకగ్రీవంగా జరిగిందని ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేసుకున్నారని ఆయన అన్నారు. మద్యం సిండికేట్ల నుంచి ముడుపులు తీసుకున్న ఆబ్కారీ మంత్రి మోపిదేవి వెంకటరమణను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం సిండికేట్లలో భాగస్వాములైనవారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.