విజయలక్ష్మికి నో: కాంగ్రెసు అభ్యర్థుల ప్రకటన

మంగళవారం, ఫిబ్రవరి 21, 2012, 14:11 [IST]
Shabbir Ali
హైదరాబాద్: మార్చిలో జరిగే ఉప ఎన్నికలకు సంబంధించి ఏడు శాసనసభా స్థానాలకు ఎఐసిసి తన అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్‌నగర్ నుంచి దివంగత శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి సతీమణి విజయలక్ష్మి పేరును ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపాదించారు. అయితే, ఈ స్థానానికి ముత్యాల ప్రకాష్ పేరును ఎఐసిసి ఖరారు చేసింది. విజయలక్ష్మిని స్థానిక నాయకులు పెద్ద యెత్తున వ్యతిరేకించారు. అలాగే, కామారెడ్డి నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పోటీకి దించాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించినా రాజా రెడ్డి పేరును ఎఐసిసి ఖరారు చేసింది.

మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డిని, స్టేషన్ ఘనపూర్ నుంచి రాజారపు ప్రతాప్‌ను పోటీకి దించుతున్నట్లు ప్రకటించింది. ఆదిలాబాద్ అభ్యర్థిగా రామచంద్రా రెడ్డిని ఖరారు చేసింది. నాగర్ కర్నూలు నుంచి దామోదర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితాను రూపొందించి, ఆ జాబితాతో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీకి వెళ్లేలోగానే అభ్యర్థుల పేర్లను ఐఎసిసి ప్రకటించింది. కోవూరు సీటుకు పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డిని ఖరారు చేసింది. బొత్స సత్యనారాయణ మంగళవారం రాత్రి రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కలుస్తారు. ఆజాద్‌ను కలిసిన తర్వాత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయి.
English summary
AICC announced its candidates for bypolls to be held in March.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs