హోటల్లో సర్వ్‌ చేస్తూ అమ్మాయిలు: 'కిరణాల'పై గాలి

మంగళవారం, ఫిబ్రవరి 21, 2012, 9:25 [IST]
Gali Muddu Krishnama
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువకిరణాలలో కూలీలు, వెయిటర్లు, సర్వర్లు, కాపలాదారుల ఉద్యోగాలు ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దు కృష్ణ నాయుడు సోమవారం విమర్శించారు. రాజీవ్ యువ కిరణాలు అంధకార కిరణాలుగా మారుతున్నాయని, సర్వర్లకు, సెక్యూరిటీ సిబ్బందికి ఈ పథకం పనికి వస్తోందని అన్నారు. తాను నిన్న తిరుపతిలో హోటల్‌కు వెళ్తే అక్కడ మా నియోజకవర్గం అమ్మాయిలు సర్వింగ్ చేస్తూ కనిపించారని, ఏమిటని అడిగితే యువ కిరణాలు కింద శిక్షణ ఇచ్చి హోటల్‌లో సర్వర్లుగా చేర్పించారని తనతో చెప్పారని ఆయన తెలిపారు. కూలీలు, వెయిటర్లు, సర్వర్లు, కాపలాదారుల ఉద్యోగాలకు శిక్షణకు ఇంత పెద్ద పథకం, ఇన్ని కోట్ల నిధులు కావాలా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లాలని పార్టీ ఆదేశిస్తే తాము వెళ్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది అవుతోందన్న దుగ్ధతో కేంద్రమంత్రి చిదంబరం, వీరప్ప మొయిలీ కలిసి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినాన కేక్ మాదిరిగా రాష్ట్రాన్ని కోసి ముక్కలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు.

తన కుమారుడి కోసం బీర్ల అమ్మకపు కంపెనీతో చేసుకున్న ఒప్పందాలు బయటపడటంతో ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ కొత్త అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నకిలీ మద్యం తయారీని అరికట్టేందుకు హోలోగ్రాంలు ఉపయోగించాలనే ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని సైతం మంత్రి స్వార్థానికి వాడుకున్నారని విమర్శించారు. మద్యం కంపెనీలతో కుమ్మక్కైన ముఖ్యమంత్రి అదనపు మద్యం ఉత్పత్తికి అనుమతిచ్చినట్లే తన మంత్రులను అదే దారిలో ప్రోత్సహిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కూలదోస్తారనే భయంతోనే ఎసిబి నివేదికలోని పేర్లు బయటపెట్టడం లేదన్నారు.

English summary
TDP senior leader Gali Muddukrishnama Naidu blamed CM Kiran Kumar Reddy's Rajeev Yuvakiranalu scheme.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs