జగన్ పార్టీ మా శత్రువే, అసత్య ప్రచారం: వైయస్ వివేకా

మంగళవారం, ఫిబ్రవరి 21, 2012, 14:05 [IST]
YS Vivekananda Reddy
న్యూఢిల్లీ: తన సోదరుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమకు ప్రధాన శత్రువు అని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ నేత వైయస్ వివేకానంద రెడ్డి మంగళవారం అన్నారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెసుకు ప్రధాన శత్రువులు తెలుగుదేశం, జగన్ పార్టీలేనని ఆయన స్పష్టం చేశారు. తాము జగన్ పార్టీతో కలిసే ప్రసక్తే లేదన్నారు. తాను అధిష్టానాన్ని రాజ్యసభ సీటు అడిగేందుకే ఢిల్లీ వచ్చానని చెప్పారు. పార్టీ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవ చేశాను కాబట్టే తాను పదవిని ఆశిస్తున్నానని అన్నారు. కాంగ్రెసు ఇప్పటి వరకు ఎవరినీ వాడుకొని వదిలేయలేదన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని అందలమెక్కిస్తుందన్నారు.

జగన్‌తో సహా అవినీతి ఆరోపణలు వచ్చిన వారు ఎవరైనా విచారణకు హాజరు కావాల్సిందేనని అన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ చేస్తే కక్ష సాధింపు చర్యలు అనుకోవడం పొరబాటు అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ చేస్తున్న ప్రచారం తప్పన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పుడూ విస్మరించలేదన్నారు.
English summary
YS Vivekananda Reddy treated YS Jaganmohan Reddy's YSR Congress party as Congress party enemy.
User Comments
[ మీ వ్యాఖ్య రాయండి ]
ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .
1st Preliminary Final , Subrata Roy Sahara Stadium, Gahunje
Kolkata Knight Riders won by 18 runs