మహబూబ్‌నగర్: తనకు మహబూబ్‌నగర్ శాసనసభ సీటు టికెట్ కాంగ్రెసు తనకు ఇవ్వకపోవడంపై దివంగత శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి సతీమణి విజయలక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇతర పార్టీలు ప్రయత్నించినా ఆమె కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేయడానికే సిద్ధపడ్డారు. అయితే, ఆమెకు కాంగ్రెసు నాయకత్వం టికెట్ నిరాకరించింది. మహబూబ్‌నగర్ అభ్యర్థిగా ముత్యాల ప్రకాష్ పేరును ఖరారు చేసింది. దీంతో విజయలక్ష్మి ఆవేదనకు గురయ్యారు.
మహబూబ్‌నగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమె చెప్పారు. తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న ఆరు స్థానాల్లో మూడు స్థానాలు మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఉన్నాయి. కొల్లాపూర్ సీటును విష్ణువర్ధన్ రెడ్డికి, నాగర్ కర్నూలు సీటును దామోదర్ రెడ్డికి కేటాయించారు. మహబూబ్‌నగర్ సీటు విజయలక్ష్మికి ఇస్తే ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే అవుతారు. దీంతో మహబూబ్‌నగర్ నుంచి బిసి అభ్యర్థిని రంగంలోకి దించాలని కాంగ్రెసు నాయకత్వం భావించినట్లు తెలుస్తోంది. దీంతో విజయలక్ష్మికి టికెట్ దక్కలేదు.