ముంబయి: ప్రముఖ పాత్రికేయుడు జ్యోతిర్మయి డే హత్య కేసులో అరెస్టైన జర్నలిస్టు జిగ్నా వోరాపై ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేశారు. ఆమెపై ఎంసిఓసిఏ, ఆర్మ్ యాక్ట్, బాంబే యాక్ట్ తదితర చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంసిఓసిఏ(మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్జనైజ్డ్ క్రైం యాక్ట్) కోర్టు విచారణ జరిపి జె డే హత్య కేసులో నిందితులకు మార్చి 12వరకు కస్టడి పొడిగించింది. పాత్రికేయురాలు జిగ్నా వోరా ఈ హత్య కేసులో 11వ నిందితురాలు. జె డె హత్య కేసును దర్యాఫ్తు జరుపుతున్న క్రైమ్ బ్రాంచ్ డిసెంబర్ 3వ తేదిన మొదటి చార్జీషీట్ దాఖలు చేసింది. ఆ చార్జిషీట్‌లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు జిగ్నా వోరా పేరును చేర్చలేదు. అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ పేరును అందులో పేర్కొంది.
మృతుడు జె డెకు చెందిన మోటార్ సైకిల్ లైసెన్స్ ప్లేట్ నంబర్, చిరునామాను చోటా రాజన్‌కు వోరా ఇచ్చిందని ఆరోపిస్తూ పోలీసులు నవంబర్ 25వ తేదిన ఆమెను అరెస్టు చేశారు. రాజన్ సూచనల మేరకు జె డెను జూన్ 11వ తేదిన ఆయనను చంపారని ఆరోపణలు ఉన్నాయి. మొదటిసారి చార్జిషీట్ దాఖలు చేసినప్పుడు వోరా మినహా మిగతా అందరి నిందితులకు హత్యతో గల సంబంధాన్ని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వోరా ఫోన్ ద్వారా రాజన్, నిందితుడితో మాట్లాడింది.