హైదరాబాద్: ఇళ్ల కేటాయింపులో అక్రమాలకు జైలుకు పోతావని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి పార్థసారథిని హెచ్చరించారు. తప్పు చేస్తే తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని, స్టే మాత్రం తెచ్చుకోనని మంత్రి పార్థసారథి అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చంద్రబాబు ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలపై శాసనసభలో బుధవారం తీవ్ర రగడ జరిగింది. కృష్ణా జిల్లాలో ఇళ్ల కేటాయింపుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీశాయి. దీనికి కాంగ్రెసు సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దాంతో తెలుగుదేశం సభ్యులు తీవ్రంగా ప్రతిస్పందించారు. కాంగ్రెసు కార్యకర్తల నుంచి ఇళ్ల కేటాయింపులకు దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, ఇది అక్రమమని తెలుగుదేశం సభ్యులు అన్నారు. అసెంబ్లీలో దుమారం చెలరేగుతున్న సమయంలో చంద్రబాబు మౌనంగా కూర్చున్నారు.
తెలుగుదేశం సభ్యుల ఆరోపణలకు మంత్రి పార్థసారథి ప్రతిస్పందిస్తూ వివరణ ఇచ్చారు. చంద్రబాబు జోక్యం చేసుకుంటూ - తన ఇష్టానుసారం ఇస్తానని అంటున్నారని, అటువంటి వ్యక్తి మంత్రిగా ఉండడానికి అనర్హుడు అని అన్నారు. నేను చెప్పాను, చేయించానంటే ఇది మంత్రి నీ జాగీరు కాదని చంద్రబాబు పార్థసారథిని ఉద్దేశించి అన్నారు. అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే చంచల్‌గుడా జైలులో ఉంటావని ఆయన అన్నారు. తప్పు చేశాను, కరెక్టు చేశానని మంత్రి అంటారని అనుకున్నానని, కానీ అలా అనడం లేదని ఆయన అన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం చేయకూడదని, రాజ్యాంగం ప్రకారం చేసిన ప్రమాణానికి అనుగుణంగా పనిచేయాలని, మంత్రి అలా పనిచేయడం లేదని ఆయన అన్నారు. ఎవరికి పడితే వాళ్లకు ఇళ్లు ఇస్తామనంటే చెల్లదని, మేం మీ గుండెల్లో నిద్రపోతామని చంద్రబాబు అన్నారు.
తాను జీవోను ఉల్లంఘిస్తే జైలుకు వెళ్తాను గానీ స్టే తెచ్చునని మంత్రి పార్థసారథి అన్నారు. తనను అడిగినవారికి ఇళ్లు కేటాయించానని, తెలుగుదేశం పార్టీవారికి కూడా ఇచ్చానని, రచ్చబండలో దరఖాస్తు చేస్తున్నవారికి, ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకున్నవారికి ఇళ్లు ఇచ్చానని ఆయన అన్నారు. అనర్హులకు ఇళ్లు ఇస్తే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పచ్చచొక్కాలవాళ్లు ఏ విధంగా చేశారో తమకు తెలుసునని ఆయన అన్నారు.