హైదరాబాద్: గతంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనను ఎంతగానో ఇబ్బందులకు గురిచేశారని, ఆ సంఘటనలను తాను ఎప్పుడూ మరచిపోలేనని పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను ఎప్పుడు పదవులు కోసం పనిచేయలేదని, పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారి పార్టీ శ్రేయస్సుకోసమే పనిచేసినట్లు ఆయన చెప్పారు. తాను నిజామాబాద్‌లో పోటీ చేసిన ప్రతిసారి ప్రత్యేక పరిస్థితులు ప్రభావితం చేశాయని, తన ఓటమికి అవే కారణమని అన్నారు. రాహుల్ ఒక రాజకీయ నాయకుడిగా ఎదగడానికి యూపీ ఎంతగానో తోడ్పడుతుందని ఆయన అన్నారు.
ఉప ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయని, ఫలితాలు ఏకపక్షంగా ఉండవని పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ తీవ్రత గతంలో పోల్చుకుంటే ఎక్కువగా లేదని, ఉప ఎన్నికల్లో బాన్సువాడ కన్నా మంచి ఫలితాలు కాంగ్రెసుకు వస్తాయని ఆయన అన్నారు.ఇటీవల మేడమ్ సోనియాను కలిసిన సందర్భంలో తాను ఎవరిపై ఫిర్యాదు చేయలేదని, మర్యాద పూర్వకంగానే ఆమెను కలిసినట్లు ఆయన వివరించారు. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో తాను మంత్రి పదవి ఆశించడం లేదని, ఎమ్మెల్సీ పదవి మేడమ్ దయవల్లే వచ్చిందని డీఎస్ స్పష్టం చేశారు.
కామారెడ్డి ఉప ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన షబ్బీర్ అలీయే సరైన వ్యక్తని, గతంతో పోల్చుకుంటే నియోజక వర్గంలో పరిస్థితి పూర్తిగా మారిందని డీఎస్ విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సీనియర్లు పోటీకి వెనుకాడడం సరికాదని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఆయనకే సానుకూలంగా ఉందని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు ప్రభుత్వానికి రెఫరెండమ్ కాదని అన్నారు.